
ప్రజల సమస్యలపై దృష్టి పెట్టండి
మెదక్ కలెక్టరేట్: అధికారులు కాంట్రాక్టర్లపై కాకుండా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే రోహిత్‌రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వివిధశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వరదలతో జిల్లాలో పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ శాఖలకు సంబంధించిన రోడ్లు కల్వర్టులు, కాజ్‌వేలు, చెరువులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందన్నారు. తాత్కాలిక మరమ్మతులకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌లో రూ. 10 కోట్లు ఉన్నట్లు చెప్పారు. పాపన్నపేట మండలంలోని కొత్తపల్లి బ్రిడ్జి నిర్మాణం ఎన్నిసార్లు చెప్పినా.. ఎందుకు పూర్తి చేయడం లేదని ఆర్‌అండ్‌బీ ఈఈ సర్ధార్‌సింగ్‌ను ప్రశ్నించారు. కేవలం రూ. 60 లక్షల కోసం పనులు నిలిపివేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్‌ను తొలగించి కొత్త వారికి పనులు అప్పగించి త్వరితగిన పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే మెదక్, రామాయంపేట రైతు బజార్లు వెంటనే రద్దు చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. అలాగే మెదక్ కూరగాయల మార్కెట్‌లో గిరిజన మహిళ పట్ల దురుసుగా వ్యవహరించిన కాంట్రాక్టర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డీఎస్పీకి సూచించారు. మెదక్ సుందరీకరణ పనుల్లో వేగం పెంచి త్వరిగతిన పనులు పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డికి సూచించారు. సమావేశంలో కలెక్టర్ రాహుల్‌రాజ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు
తాత్కాలిక మరమ్మతులకు
రూ. 10 కోట్లు