
నాణ్యమైన భోజనం అందించాలి
కౌడిపల్లి(నర్సాపూర్): విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎస్టీ బాలుర ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్‌హాల్, తరగతి గదులు, పరిసరాలు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వర్షాల నేపథ్యంతో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. పాత, శిథిలమైన భవనాలు ఉంటే మరోచోట వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థుల సౌకర్యం కోసం అన్ని వసతులు కల్పిస్తామన్నారు. ఆయన వెంట ఎంఈఓ బాలరాజు, వార్డెన్ జయరాజ్, ఉపాధ్యాయులు ఉన్నారు. అనంతరం ముట్రాజ్‌పల్లిలో ఇటీవల గ్యాస్ సిలిండర్ పేలడంతో ధ్వంసమైన అకుల శ్రీనివాస్ ఇంటిని పరిశీలించారు. బాధితుడితో మాట్లాడి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ కృష్ణ, ఆర్‌ఐ శ్రీహరి, గ్రామస్తులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్