
దెబ్బతిన్న పంటల పరిశీలన
పెద్దశంకరంపేట(మెదక్): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని ఆయా గ్రామాలలో పంటలు దెబ్బతిన్నాయని ఎంపీడీఓ షాకీర్‌అలీ అన్నారు. శుక్రవారం బద్దారం, ఉత్తులూర్ తదితర గ్రామాలలో ఈజీఎస్ అధికారులతో కలిసి పంట పొలాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పంటలలో ఇసుక మేటలను తొలగించుకునేందుకు ఉపాధిహామీ ద్వారా ప్రభుత్వం అవకాశం కల్పించిందని, ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని కోరారు. ఆయా గ్రామాలలో డ్రై డే సందర్భంగా ప్రజలకు నీటి నిల్వ, రోగాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ వినీత్, ఈసి.నవాజుద్దీన్, టేఏ వినోద, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు ఉన్నారు.