
17 నుంచి సేవా కార్యక్రమాలు
నర్సాపూర్: ఈనెల 17నుంచి పక్షం రోజుల పాటు సేవా కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్‌గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రధాని పుట్టిన రోజు నుంచి అక్టోబరు రెండవ తేదీ వరకు సేవా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. రక్తదాన శిబిరాలు, అమ్మ పేరుతో మొక్కలు నాటడం, కుల వృత్తులు, రిటైర్డు ఉద్యోగులను సన్మానించడం, ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు పండ్లు పంచడం తదితర సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన వివరించారు. సమావేశంలో పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్‌గౌడ్, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు నగేష్, పార్టీ నాయకులు నారాయణరెడ్డి, బాల్‌రాజ్, రాములు నాయక్, నర్సింలు, మహెందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్‌గౌడ్