
తప్పని యూరియా తిప్పలు
యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. శుక్రవారం వెల్దుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఉదయం 4 గంటల నుంచి లైన్‌లో నిలబడ్డారు. వారం రోజులుగా యూరియా లేక ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నశంకరంపేట మండలం జంగరాయి సహకార సంఘం వద్దకు యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు ఉదయమే చేరుకొని క్యూలైన్‌లో చెప్పులు పెట్టారు. చిన్నశంకరంపేట సహకార సంఘం వద్ద బారుతీరిన రైతులు గంటల కొద్ది వేచిచూశారు. అయితే మహిళల మధ్య మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. ఒక మహిళ రెండుసార్లు లైన్‌లో నిలబడి ఎక్కువ బస్తాలు తీసుకుందని మరో మహిళ ఆమైపె చేయి చేసుకుంది. పక్కన ఉన్న మహిళలు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. కొల్చారం మండలంలోని రంగంపేట రైతు ఆగ్రో సేవా కేంద్రానికి 400 బస్తాల యూరియా వచ్చింది. రైతు వేదిక వద్ద టోకెన్లు ఇవ్వడంతో రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
– వెల్దుర్తి(తూప్రాన్)/కొల్చారం(నర్సాపూర్)/చిన్నశంకరంపేట(మెదక్)

తప్పని యూరియా తిప్పలు

తప్పని యూరియా తిప్పలు