
తాగి వాహనాలు నడిపితే జైలుకే..
ఎస్‌ఐ శంకర్ హెచ్చరిక
అల్లాదుర్గం(మెదక్): మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని ఎస్‌ఐ శంకర్ హెచ్చరించారు. గురువారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి శుక్రవారం అల్లాదుర్గం పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే మొదటిసారి జరిమానా విధిస్తామన్నారు. మళ్లీ పట్టుబడితే జైలు శిక్ష తప్పదన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడంతో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుని కుటుంబాలు వీధిన పడుతున్నాయని చెప్పారు. వాహనదారులు మద్యానికి దూరంగా ఉండాలని సూచించారు.
పీఏపీఎస్ చైర్మన్‌గా నరసింహారెడ్డి
టేక్మాల్ (మెదక్): టేక్మాల్ పీఏపీఎస్ చైర్మన్‌గా ధనూర గ్రామానికి చెందిన బి.నరసింహారెడ్డి ఎన్నికయ్యారు. శుక్రవారం టేక్మాల్ పీఏపీఎస్ కార్యాలయంలో సీఈఓ సాయిలు సమక్షంలో డైరెక్టర్లు నరసింహారెడ్డిని చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఇదివరకు పీఏపీఎస్ చైర్మన్ యశ్వంత్ రెడ్డిపై వేసిన విచారణలో అవినీతి చేసినట్లు నిర్ధారణ కావడంతో ఆయనను తొలగించారు. దీంతో నూతన చైర్మన్‌గా నరసింహారెడ్డిని ఎన్నుకున్నారు.
పుస్తకాలు సమకూరుస్తా
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి
నర్సాపూర్: పోటీ పరీక్షలకు చదివేందుకు అవసరమయ్యే పుస్తకాలు సమకూరుస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి చెప్పారు. శుక్రవారం అల్లూరి సీతారామరాజు గిరిజన బాలుర ఫైన్ ఆర్ట్స్ కాలేజీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాలను పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అవసరమయ్యే పుస్తకాలు సమకూరుస్తానని సుహాసినిరెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సిబ్బంది సుహాసినిరెడ్డిని శాలువతో సన్మానించారు.
ఉపాధ్యాయులకు సన్మానం
హవేళిఘణాపూర్(మెదక్): జిల్లా స్థాయిలో జరిగిన టీఎల్‌ఎం మేళాలో అద్భుతమైన టీఎల్‌ఎం తయారు చేసి రాష్ట్ర స్థాయికి ఎంపికై న ఉపాధ్యాయులను ఎంఈఓ మధుమోహన్ శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ మండలంలో పని చేస్తున్న రవీందర్‌రెడ్డి, బాలశేఖర్, జిల్లా స్థాయి ఉత్తమ అవార్డు పొందిన నర్సింలును అభినందించారు. విద్యార్థులకు మంచి బోధన చేసి ప్రతిభ కనబర్చి ఎంపిక కావడం శుభపరిణామని చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లారెడ్డి, తదితరులు ఉన్నారు.
అనుమతి లేకుండా
చెట్లు నరికివేస్తే చర్యలు
తూప్రాన్: మున్సిపాలిటీ పరిధిలో అనుమతి లేకుండా చెట్టు కొమ్మలు నరికిన వ్యాపార సంస్థకు శుక్రవారం మున్సిపల్ అధికారులు జరిమానా విధించారు. పట్టణంలోని మోర్ వ్యాపార సంస్థ ఎదుట చెట్టు కొమ్మలు అడ్డుగా ఉన్నాయని నిర్వాహకులు నరికివేశారు. గుర్తించిన మున్సిపల్ అధికారులు ఆ వ్యాపార సంస్థకు రూ. 5 వేల జరిమానా విధించారు. అనుమతి లేకుండా చెట్లు నరికివేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

తాగి వాహనాలు నడిపితే జైలుకే..

తాగి వాహనాలు నడిపితే జైలుకే..

తాగి వాహనాలు నడిపితే జైలుకే..

తాగి వాహనాలు నడిపితే జైలుకే..