
అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు డాక్టరేట్
నర్సాపూర్: తమ కళాశాలలోని ఏఐడీఎస్ బ్రాంచ్‌లో అసిస్టెంటు ప్రొఫెసర్‌గా పని చేస్తున్న అమరేందర్‌రెడ్డికి డాక్టరేట్ వచ్చిందని బీవీఆర్‌ఐటీ ప్రిన్సిపాల్ సంజయ్‌దూబె తెలిపారు. అమరేందర్‌రెడ్డి విజయవాడకు చెందిన కేఎల్‌ఈఎఫ్ విశ్వవిద్యాలయం నుంచి సీఎస్‌ఈ విబాగంలో మెటీ–హ్యూరిస్టిక్ విధానాల ఆధారంగా శక్తి సమర్థవంతమైన మేఘ గణన అంశంపై డాక్టరేట్ పొందారని ఆయన వివరించారు. కాగా అమరేందర్‌రెడ్డిని ప్రిన్సిపాల్ సంజయ్‌దూబె, డైరెక్టర్ లక్ష్మిప్రసాద్, హెచ్‌ఓడీ దశరథరామయ్య తదితరులు అభినందించారు.
భాష, యాసను మరవొద్దు
జెడ్పీ పాఠశాల హెచ్‌ఎం దీప్లారాథోడ్
చిన్నశంకరంపేట(మెదక్): తెలంగాణ భాషా యాసను మరిచిపోవద్దని చిన్నశంకరంపేట జెడ్పీ పాఠశాల హెచ్‌ఎం దీప్లారాథోడ్ అన్నారు. శుక్రవారం చిన్నశంకరంపేట జెడ్పీ పాఠశాలలో తెలంగాణ భాషా తెలుగుపై టీఎల్‌ఎం మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజి నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలగు పండిత్‌లు వసుందదేవి, మంజుల, కిషన్‌లను శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు పోచయ్య పాల్గొన్నారు.
ముమ్మరంగా ఓపెన్ స్కూల్‌లో ప్రవేశాలు
శివ్వంపేట(నర్సాపూర్): పది, ఇంటర్‌లో ఓపెన్ స్కూల్ ప్రవేశాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. శివ్వంపేట ఉన్నత పాఠశాల ఓపెన్ స్కూల్‌కు సంబంధించి పదిలో 25, ఇంటర్‌లో 35 మంది ప్రవేశాలు పొందినట్లు ఓపెన్ స్కూల్ మండల కో ఆర్డినేటర్ బాలచంద్రం తెలిపారు. గ్రామాల్లో చదువు మానేసిన వారిని గుర్తించేందుకు ఐకేపీ సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్ల ప్రవేశాలు పెరిగాయని బాలచంద్రం చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, ఐకేపి సీసీ సరిత, తదితరులు ఉన్నారు.

అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు డాక్టరేట్

అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు డాక్టరేట్