
ఘనంగా మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు
తూప్రాన్: పట్టణంలో మైనార్టీ సోదరులు మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు శుక్రవారం ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ నుంచి పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వరకు ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. మైనార్టీలు ప్రతి ఏటా ఈ పండుగను సంతోషంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంటుందని, ఈ పండుగ విశిష్టతను మత పెద్దలు వివరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్‌ఐ శివానందం బందోబస్తు చేపట్టారు.
ముస్లింల ర్యాలీ
మనోహరాబాద్(తూప్రాన్): మిలాద్–ఉన్–నబీ వేడుకలలో భాగంగా మనోహరాబాద్, కాళ్లకల్ ముప్పిరెడ్డిపల్లి, పర్కిబండ, లింగారెడ్డిపేట్‌లో ముస్లింలు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. అంతకు ముందు మజీద్‌లలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మనోహరాబాద్‌లో నిర్వహించిన ర్యాలీలో ఎస్‌ఐ సుభాష్‌గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల మైనార్టీ అధ్యక్షుడు జావీద్‌పాషా, కమిటీ అధ్యక్షుడు అజీజ్‌ఖాన్, సభ్యులు సమద్, నయిమ్, రజాక్, రఫీక్, షర్ఫుద్దీన్, మహ్మద్‌బేగ్, సంయుద్దీన్, గౌస్, ఫహీం, ఉస్మాన్, గులాం, జిలానీ, మోయిజ్, అప్సర్, ఇర్షాద్, అజ్జు, లాయ్ తదితరులు పాల్గొన్నారు.