
ప్రభుత్వ బడుల్లోనే మెరుగైన బోధన
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి
కౌడిపల్లి(నర్సాపూర్)/శివ్వంపేట: ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారని, విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి సూచించారు. గురువారం కౌడిపల్లికి చెందిన పోల నవీన్ రూ. 59 వేలతో ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో కిచెన్‌షెడ్ నిర్మించగా ప్రారంభించి మాట్లాడారు. యువత సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. పాఠశాలలో నీటి సమస్యను తీర్చేందుకు బోర్ వేయిస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం మనఊరు– మన బడి ద్వారా పాఠశాలల్లో సమస్యలు తీర్చిందన్నా రు. ప్రస్తుత ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం లలితాదేవి, మాజీ సీడీసీ చైర్మన్ దుర్గారెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ కలీముల్ల, నాయకులు మన్సూర్, మహిపాల్‌రెడ్డి, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే అనంతరం శివ్వంపేట మండల పరిధి ఉసిరికపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. అన్నివర్గాలకు సముచిత స్థానం కల్పించిన అంబేద్కర్ అందరివాడని కొనియాడారు. విగ్రహ ఏర్పాటుకు కృషిచేసిన నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు.