
డెమో ద్వారా గెస్ట్ టీచర్ల ఎంపిక
కౌడిపల్లి(నర్సాపూర్): ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాల, కళాశాలల్లో గెస్ట్ ఉపాధ్యాయులు, లెక్చరర్లను డెమో క్లాస్‌ల ద్వారా ఎంపిక చేస్తున్నట్లు ఆర్‌సీఓ గౌతంకుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని తునికి వద్ద గల ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలో దరఖాస్తు చేసుకున్న గెస్ట్ ఉపాధ్యాయులు, లెక్చరర్లకు నిర్వహిస్తున్న డెమో క్లాస్‌లను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ ఎంజేపీ గురుకులాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, లెక్చరర్ల పోస్టులను గెస్ట్ ఉపాధ్యాయులుతో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. డెమో నిర్వహించి ఉత్తమ బోధన, ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్, ప్రిన్సిపాల్ హరిబాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఎంజేపీ ఉమ్మడి జిల్లా ఆర్‌సీఓ గౌతంకుమార్‌రెడ్డి