బకాయిలు చెల్లించాలని ఏఐటీయూసీ ధర్నా | - | Sakshi
Sakshi News home page

బకాయిలు చెల్లించాలని ఏఐటీయూసీ ధర్నా

Oct 14 2026 4:17 AM | Updated on Oct 14 2026 4:17 AM

శ్రీరాంపూర్‌: సింగరేణికి రావాల్సిన రూ.59 వేల బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు మంగళవారం హైదరాబాద్‌లోని విద్యుత్‌సౌద ఎదుట ధర్నా నిర్వహించారు. కంపెనీ వ్యాప్తంగా 12 డివిజన్‌ల నుండి నాయకులు, కార్యకర్తలు ధర్నాకు తరలివెళ్లారు. కార్యక్రమంలో ఆ యూనియన్‌ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌, జాతీయ వర్కింగ్‌ కమిటీ ప్రెసిడెంట్‌ యూసఫ్‌, కేంద్ర కమిటీ నాయకులు మిర్యాల రంగయ్య, ముస్కే సమ్మయ్య, ఎల్లయ్య, శ్రీరాంపూర్‌ బ్రాంచ్‌ కార్యదర్శి బాజీసైదా పాల్గొన్నారు.

మందమర్రి నుంచి తరలివెళ్లిన నాయకులు

మందమర్రిరూరల్‌: ఏఐటీయూసీ బ్రాంచ్‌ సెక్రెటరీ సత్యనారాయణ, నాయకులు సుదర్శన్‌, శ్రీనివాస్‌, సంపత్‌, వెంకన్న, రాజేశ్వర్‌, కుమారస్వామి, తదితరులు ధర్నాకు తరలివెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement