చెన్నూర్: మహారాష్ట్ర నుంచి చెన్నూర్ మీదుగా మంచిర్యాలకు వైపు గంజాయి మొక్కలను తరలిస్తున్న ఇద్దరు యువకులను వేర్వేరు ప్రాంతాల్లో అరెస్ట్ చేసినట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. మంగళవారం పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ వివరాలు వెల్లడించారు. జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా మహారాష్ట్ర నుంచి వస్తున్న బైక్ను తనిఖీ చేయగా నానేశ్ అనే యువకుని బ్యాగులో 4 గంజాయి మొక్కలు లభించాయి. ఆర్టీసీ బస్టాండ్లో అనుమానితులను ఎస్సై శ్యాంపటేల్, సిబ్బంది తనిఖీ చేస్తుండగా ఆకాశ్ అనే వ్యక్తి సంచిలో 350 గంజాయి మొక్కలు లభించాయన్నారు. గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని ఇరువురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు.


