కార్మిక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం | - | Sakshi
Sakshi News home page

కార్మిక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

Oct 14 2026 4:17 AM | Updated on Oct 14 2026 4:17 AM

జైపూర్‌: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్‌ అహ్మద్‌, అధ్యక్షుడు తిప్పారపు సారయ్య విమర్శించారు. మండలంలోని ఇందారం ఐకే1ఏ, ఐకే–వోసీపీపై మంగళవారం పర్యటించారు. అనంతరం వారు మాట్లాడుతూ మెడికల్‌ బోర్డును నెలకు రెండుసార్లు నిర్వహించాలని, 2020 నుంచి 2026వరకు డిస్మిస్‌ అయిన కార్మికులందరినీ తిరిగి విధుల్లో తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల సొంతింటి పథకం ఆదాయపన్ను మినహాయింపు, పాత వీఆర్‌ఎస్‌ పథకాల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌జీ–1 వైస్‌ ప్రెసిడెంట్‌ ఆరెల్లి పోశం, బ్రాంచ్‌ కార్యదర్శి పొనగంటి అశోక్‌, ఫిట్‌ సెక్రెటరీలు సాయి, గుండ్ల లక్ష్మణ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement