పాతమంచిర్యాల: ఎన్హెచ్ 63 రోడ్డు విస్తరణలో పాత అలైన్మెంట్ కొనసాగించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని బీజేపీ నాయకులు తుల మధుసూదన్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న నిర్వాసితులతో కలిసి రాజ్యాంగ ప్రతులతో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్హెచ్ 63 బ్రౌన్ ఫీల్డ్ హైవేను గ్రీన్ ఫీల్డ్ హైవేగా మార్చడం వలన భూములు కోల్పోయిన రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. బడా బడావ్యాపారుల కోసం రోడ్డు అలైన్ మెంట్ మార్చి చిన్న సన్నకారు రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు. ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్ వెంకట స్వామి, ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు రైతులకు నష్టం జరగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కర్రె లచ్చన్న, గంద శ్రీనివాస్, సురేందర్ చారి, లగిశెట్టి రాజమౌళి, చెల్ల వెంకటే్ష్, బొలిశెట్టి తిరుపతి, మాజీ ఎంపీటీసీ తిరుపతి, దాస్య నాయక్, తదితరులు పాల్గొన్నారు.


