అడవిపంది ఢీకొని ఐకేపీ సీఏ మృతి | - | Sakshi
Sakshi News home page

అడవిపంది ఢీకొని ఐకేపీ సీఏ మృతి

Oct 14 2026 4:17 AM | Updated on Oct 14 2026 4:17 AM

లక్సెట్టిపేట: అడవిపంది ఢీకొని ఐకేపీ సీఐ మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గోపతి సురేష్‌ తెలిపిన వివరాల మేరకు మండలంలోని దౌడపల్లి గ్రామానికి చెందిన దుర్గం రాములు (48) ఐకేపీలో సీఏగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 12న మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో బైక్‌ పార్క్‌ చేసి స్నేహితులతో కలిసి విజయవాడ దర్శనానికి వెవెళ్లాడు. రాత్రి మంచిర్యాలకు చేరుకుని బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా మంగళవారం తెల్లవారు జామున గుల్లకోట స్టేజీ వద్ద అడవిపంది అడ్డువచ్చి బైక్‌ను ఢీకొట్టింది. కింద పడడంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య సుభాషిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement