విద్య, వైద్యానికి హబ్‌గా మంచిర్యాల | - | Sakshi
Sakshi News home page

విద్య, వైద్యానికి హబ్‌గా మంచిర్యాల

Oct 11 2026 11:43 PM | Updated on Oct 11 2026 11:43 PM

● ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల నియోజక వర్గాన్ని విద్య, వైద్యానికి హబ్‌గా మారుస్తానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, మంచిర్యాల బస్టాండ్‌ పునర్నిర్మాణ పనుల నమూనాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ప్రదర్శించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు ముందే ఆర్టీసీ బస్టాండ్‌ను పూర్తిస్థాయిలో ఆధునీకరిస్తామన్నారు. రూ.30 కోట్ల తో 18 ప్లాట్‌ఫాంలు నిర్మించనున్నట్లు తెలిపారు. విశ్రాంతి గదులు, మినీ థియేటర్‌, షాపింగ్‌ మాల్‌, వంటి సౌకర్యాలను ప్రయాణీకులకు కల్పించేలా ని ర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధిక మంది విద్యార్థులు అడ్మిషన్‌ పొందిన కళాశాలగా లక్సెట్టిపేట ప్రథమస్థానంలో నిలవడం, ప్రైవే టు పాఠశాలల్లోని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడంలో మంచిర్యాల నియోజకవర్గం టాప్‌లో నిలిచిందన్నారు. ఇందుకు కలెక్టర్‌ అవార్డు అందుకున్నారన్నారు. సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను మాఫీ చేయాలన్న తన విన్నపానికి సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించారన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మేయర్‌ ధర్ని మధుకర్‌, డిప్యూటీ మేయర్‌ సల్ల రమ్య, కమిషనర్‌ అన్వేష్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ రాజు, ఆర్టీఏ మెంబర్‌ అంకతి శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడు తూముల నరేష్‌, మంచిర్యాల, లక్సెట్టిపేట్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్లు రామగిరి బానేష్‌, అక్కల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement