బడికి బై బై.. దసరా ఎంజాయ్‌ | - | Sakshi
Sakshi News home page

బడికి బై బై.. దసరా ఎంజాయ్‌

Oct 10 2026 12:28 AM | Updated on Oct 10 2026 12:28 AM

మంచిర్యాలఅర్బన్‌/నెన్నెల/దండేపల్లి/తాండూర్‌: ప్రభుత్వం దసరా సెలవు ప్రకటించడంతో శుక్రవారం విద్యార్థులు సొంతూళ్లకు పయనమయ్యారు. ప్రభుత్వ వసతిగృహాలు, కేజీబీవీ, గురుకులాల నుంచి కుటుంబ సభ్యులతో కలిసి బ్యాగులు, సామాన్లతో ఇంటి బాట పట్టారు. స్నేహితులతో సెల్ఫీ దిగారు. సెలవులు వినోదానికే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, నైపుణ్యాభివృద్ధికి వినియోగించుకోవాలని ఉ పాధ్యాయులు సూచించారు. చదువు, పరీక్షల ప్రిపరేషన్‌, కథల పుస్తకాలు చదవడం, హ్యాండ్‌రైటింగ్‌ మెరుగుపర్చుకోవడం, డ్రాయింగ్‌, కుట్లు, అల్లికల వంటి సృజనాత్మక పనులు నేర్చుకోవడం, అందుబాటులో ఉన్న వనరుల ద్వారా బేస్‌ కంప్యూటర్‌ నైపుణ్యాలు సాధారణ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని తెలిపా రు. మండల కేంద్రాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు బస్సుల కోసం నిరీక్షించాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement