హెచ్‌ఐవీపై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

హెచ్‌ఐవీపై అవగాహన కల్పించాలి

Oct 10 2026 12:28 AM | Updated on Oct 10 2026 12:28 AM

మంచిర్యాలటౌన్‌: జిల్లాను ఎయిడ్స్‌ రహితంగా మార్చేందుకు హెచ్‌ఐవీపై యువతకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ నరేందర్‌ రాథోడ్‌ అన్నారు. టీఎస్‌ఏసీఎస్‌, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన బైక్‌ ర్యాలీని కలెక్టరేట్‌ వద్ద ఆయన ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా అంబేడ్కర్‌ విగ్రహం వద్ద వైద్య బృందం, కళాజాత బృంద సభ్యులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 2,832 హెచ్‌ఐవీ కేసులు నమోదు అయ్యాయని, వారికి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. హెచ్‌ఐవీ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. జిల్లా మాస్‌ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్‌, దిశా హెచ్‌ఐవీ కోఆర్డినేటర్‌ నీలిమ, జిల్లా వైద్య బృందం కాకిరాల వెంకటేశ్వర్లు, దూప్‌సింగ్‌, రషీద్‌, ఆర్‌ఎస్‌ పద్మ, సురేందర్‌, శ్రీనివాస్‌, దిశా సభ్యులు సంతోష్‌, రాజేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement