చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీనామా చేయాలి | - | Sakshi
Sakshi News home page

చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీనామా చేయాలి

Oct 9 2026 2:08 AM | Updated on Oct 9 2026 2:08 AM

మందమర్రిరూరల్‌: భారత చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ జ్ఞానేష్‌కుమార్‌ వెంటనే రాజీనామా చేయాలని రాష్ట్ర గనులు, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక పాతబస్టాండ్‌ జాతీయ రహదారి కూడలి వద్ద బైఠాయించి ప్లకార్డులతో ధర్నా చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోని ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ఎంతో కీలకమని, అలాంటి ఓటు హక్కును తొలగించి ప్రజాస్వామ్యాన్ని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ బీజేపీ ప్రభుత్వంతో కుమ్మక్కై ఖూనీ చేశారని ఆరోపించారు. రాజీనామా చేయనిపక్షంలో ఆందోళనలు దేశవ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, పట్టణ, మండల అధ్యక్షులు తిరుమల్‌రెడ్డి, జీవన్‌కుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement