మహిళలకు భరోసా కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలకు భరోసా కల్పించాలి

Oct 9 2026 2:08 AM | Updated on Oct 9 2026 2:08 AM

మంచిర్యాలక్రైం: బాలికలు, మహిళలకు భద్రత, భరోసా కల్పించడంలో షీ టీమ్‌, సఖీ, భరోసా కేంద్రాల సిబ్బంది సమన్వయంతో పని చేయాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. రామగుండం కమిషనరేట్‌ కార్యాలయంలో గురువారం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల షీ టీమ్‌, సఖీ, భరోసా కేంద్రాల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్‌ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా వ్యవహరించాలని అన్నారు. ఆకతాయిలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి మఫ్టీలో ఉంటూ వారి భరతం పట్టాలన్నారు. ప్రభు త్వ, ప్రైవేటు కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణకు కృషి చేయాలన్నా రు. అదనపు డీసీపీ శ్రీనివాస్‌, సీసీఆర్‌బీ సీఐ అనిల్‌, సంధ్య, బీ.సత్యనారాయణ, ఎస్సైలు హైమా, ఉషారాణి, ఒబులమ్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement