ఏసీబీకి చిక్కిన ఎఫ్‌ఎస్‌వో | - | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన ఎఫ్‌ఎస్‌వో

Oct 9 2026 2:08 AM | Updated on Oct 9 2026 2:08 AM

● టింబర్‌ డిపో లైసెన్స్‌ రెన్యూవల్‌కు రూ.15 వేలు డిమాండ్‌ ● రూ.12 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు

● టింబర్‌ డిపో లైసెన్స్‌ రెన్యూవల్‌కు రూ.15 వేలు డిమాండ్‌ ● రూ.12 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు

ఖానాపూర్‌: నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ అటవీశాఖ కార్యాలయంలో ఎఫ్‌ఎస్‌వో(ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌) రవీందర్‌ గురువారం రూ.12 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ ఆదిలాబాద్‌ డీఎస్పీ జి.మధు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్‌కు చెందిన టింబర్‌ డిపో నిర్వాహకుడు రవితేజ డిపో లైసెన్స్‌ రెన్యువల్‌ కోసం ఆగస్టులో దరఖాస్తు చేసుకున్నాడు. పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా పని కాకపోవడంతో ఎఫ్‌ఎస్‌వో రవీందర్‌ను కలిశాడు. ఆయన రూ.20 వేలు లంచం డిమాండ్‌ చేశాడు. ముందుగా రూ.15 వేలకు, చివరకు రూ.12 వేలకు ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని రవితేజ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో పక్కా ప్రణాళికతో గురువారం కార్యాలయ ఆవరణలోని తన కారులో రవీందర్‌ రూ.12 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడిని కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement