పరిశీలనే మిగిలింది ‘సర్‌’! | - | Sakshi
Sakshi News home page

పరిశీలనే మిగిలింది ‘సర్‌’!

Oct 9 2026 2:08 AM | Updated on Oct 9 2026 2:08 AM

ముగిసిన అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ ప్రక్రియ

ఉమ్మడి జిల్లాలో వేలల్లో కొత్తగా ఓటరు నమోదు దరఖాస్తులు

తుది ఓటరు జాబితాపై ఆసక్తి

సాక్షి, ఆదిలాబాద్‌: కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియలో అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ గడువు బుధవారం ముగిసింది. ఫారం–6, 6ఏ, 7, 8 అందజేత కూడా పూర్తి కాగా, ఇక పరిశీలన కొనసాగనుంది. సర్‌ ప్రక్రియలో భాగంగా ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో జారీ చేసిన విషయం తెలిసిందే. గత జూన్‌ నాటికి ఆయా జిల్లాల్లోని ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్‌ ఫారాల స్వీకరణ, డిజిటలైజేషన్‌ కొనసాగింది. డెత్‌, షిఫ్టింగ్‌, డూప్లికేట్‌, ఆబ్సెంట్‌ అంశాల ఆధారంగా ఓటర్లను తొలగించి డిజిటలైజేషన్‌ ప్రకారం ముసాయిదా ఓటరు జాబితాను అప్పట్లో విడుదల చేశారు. అప్పటి నుంచి వివిధ ఫారాల ఆధారంగా అభ్యంతరాలు, దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు.

పరిశీలన ప్రక్రియ మొదలు

ఫారం–6 ద్వారా వచ్చిన కొత్త ఓటర్ల దరఖాస్తుల పరిశీలన, వివిధ నోటీసుల పరిష్కార ప్రక్రియ చేపట్టనున్నారు. కొత్త ఓటర్ల కచ్చిత సంఖ్య, మొత్తం ఓటర్ల వివరాలతో కూడిన తుది జాబితాను నవంబర్‌ 9న విడుదల చేయనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఫారం–6 ద్వారా కొత్తగా ఓటు నమోదుకు 16,223 మంది దరఖాస్తు చేసుకున్నారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరులు ఓటరుగా నమోదు చేసుకోవడానికి 6ఏ ఫారంతో దరఖాస్తు చేసుకున్నారు. దీంట్లో ఆదిలాబాద్‌ జిల్లా నుంచి 13మంది, నిర్మల్‌ నుంచి 25, మంచిర్యాల నుంచి 17, కుమురంభీం ఆసిఫాబాద్‌ నుంచి ఆరుగురు నమోదు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఫారం–7 విషయంలో దేశ వ్యాప్తంగా వివాదం కొనసాగుతుండగా, దీనికి సంబంధించి ఉమ్మడి జిల్లాలో 1,224 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో మంచిర్యాల నియోజకవర్గం నుంచి అత్యధికంగా 474 ఉండటం గమనార్హం. ఇక ఫారం–8కు సంబంధించి ఉమ్మడి జిల్లాలో 24,346 దరఖాస్తులు రాగా, వాటి విచారణ కొనసాగుతోంది.

నోటీసులోని అంశాలు

సర్‌ ప్రక్రియలో నో మ్యాపింగ్‌, అనామలిస్‌ అనే అంశాల ఆధారంగా ముసాయిదా జాబితాలోని ఓటర్లకు అప్పట్లో నోటీసులు జారీ చేశారు. పాత ఓటరు రికార్డులతో ఇప్పటి ఓటరు వివరాలు సరిపోల్చినపుడు ఎలాంటి లింక్‌, మ్యాచ్‌ దొరకక పోవడాన్ని నోమ్యాపింగ్‌ అంటారు. ఓటరు వివరాలు డేటాబేస్‌లో ఉన్నప్పటికీ పేర్లు, వయస్సులో తేడాలు, స్పష్టత లేని ఫొటోలు, ఇంటి పేరు మారడం, తండ్రి పేరుకు బదులు భర్త పేరు నమోదు కావడం లాంటి అంశాల ఆధారంగా అనామలిస్‌లో నమోదు చేశారు.

ఏ ఫారం ఎందుకోసమంటే..

ఫారం–6ను కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు వినియోగించాలి. ఫారం–6ఏను ఎన్‌ఆర్‌ఐలు ఓటరుగా నమోదు చేసుకోవడానికి, ఫారం–7ను ఓటరు జాబితా నుంచి పేరు తొలగింపు కోసం, అభ్యంతరం తెలపడం కోసం వాడాలి. ఫారం–8ను డేటాబేస్‌లో దిద్దుబాటు, ఓటరు కార్డు మార్పు, స్థానచలనం కోసం వినియోగించాలి.

నోటీసుల జారీ, విచారణ వివరాలు

జిల్లా జారీ అయిన విచారణ పెండింగ్‌

నోటీసులు పూర్తి

ఆదిలాబాద్‌ 1,50,244 1,25,805 24,601

నిర్మల్‌ 2,22,003 2,04,419 17,441

మంచిర్యాల 1,70,633 1,45,419 24,821

ఆసిఫాబాద్‌ 1,05,342 96,055 9,712

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement