ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
మంచిర్యాల అగ్రికల్చర్: మున్సిపల్ ఎన్నికల నిర్వ హణకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషన ర్ రాణి కుముదిని సూచించారు. మంగళవారం హై దరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి, ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అ న్ని జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులు, ఎన్నికల విభా గం అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ.. జిల్లాలో మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధం చేసినట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ చంద్రయ్య, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
స్ట్రాంగ్‌రూంను పరిశీలించిన కలెక్టర్
లక్సెట్టిపేట: మున్సిపల్ ఎన్నికల కోసం పాత ఎంపీడీవో కార్యాలయ భవనాన్ని స్ట్రాంగ్‌రూం, నామినేషన్ కేంద్రంగా ఏర్పాటు చేయడంతో కలెక్టర్ కుమార్‌దీపక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాలు కల్పించాల ని అధికారులకు సూచించారు. అనంతరం ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిని పరిశీలించారు. రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. నిర్మాణంలో ఉన్న మార్చురీ భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ విజయ్‌కుమార్, తహసీల్దార్ దిలీప్‌కుమార్ తదితరులున్నారు.
నామినేషన్ కేంద్రాల పరిశీలన
మంచిర్యాలటౌన్: నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం మున్సిపల్ కమిషనర్ అన్వేశ్, కలెక్టరేట్ ఏవో రాజేశ్వర్‌తో కలిసి పరిశీలించారు. లక్సెట్టిపేట మున్సిపాలిటీకి సంబంధించి లక్సెట్టిపేట పా త మండల పరిషత్ కార్యాలయంలో, క్యాతన్‌పల్లి, బెల్లంపల్లి, చెన్నూరు మున్సిపాలిటీలకు సంబంధించి ఆయా మున్సిపల్ కార్యాలయాల్లోనే నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపా రు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చే శామని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల సమాచారం, ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదుల కోసం 08736–205051 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.


