మిట్టపల్లిలో ఎడ్ల పందెం పోటీలు | - | Sakshi
Sakshi News home page

మిట్టపల్లిలో ఎడ్ల పందెం పోటీలు

Jan 27 2026 8:31 AM | Updated on Jan 27 2026 8:31 AM

మిట్టపల్లిలో ఎడ్ల పందెం పోటీలు

మిట్టపల్లిలో ఎడ్ల పందెం పోటీలు

జైపూర్‌: మండలంలోని మిట్టపల్లి గ్రామంలో సోమవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎడ్ల పందెం పోటీలు నిర్వహించారు. గ్రామ శివారులోని మహిళా భవన్‌ వద్ద ప్రతిఏటా నిర్వహిస్తూ వస్తున్న ఎడ్ల పందెం పోటీలను స్థానిక సర్పంచ్‌ కామెర మనోహర్‌ ప్రారంభించారు. జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన పోటీదారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిర్రకుంటకు చెందిన వోడ్నాల మారుతికి మొదటి బహుమతిగా రూ.25వేలు, పొన్నారానికి చెందిన పెంబాల లక్ష్మణ్‌, బచ్చల శివకృష్ణ రెండో బహుమతిగా రూ.17500 చొప్పున గెలుచుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా జనరల్‌ సెక్రెటరీ రిక్కుల శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక సర్పంచ్‌ మనోహర్‌ బహుమతులు ప్రదానం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement