నాగోబా సన్నిధిలో భక్తజనం | - | Sakshi
Sakshi News home page

నాగోబా సన్నిధిలో భక్తజనం

Jan 27 2026 8:31 AM | Updated on Jan 27 2026 8:31 AM

నాగోబ

నాగోబా సన్నిధిలో భక్తజనం

ఇంద్రవెల్లి: నాగోబా ఆలయంలో సోమవారం భక్తజన సందడి నెలకొంది. సెలవుదినం కావడంతో ఉ మ్మడి జిల్లా నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా జీఎస్టీ కమిషనర్‌ వై.శ్రీలీల నాగోబాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మెస్రం వంశీయులు శాలువాతో సత్కరించి నాగోబా ప్రతిమ అందజేశారు. నేడు నాగోబా జాతర హుండీ లెక్కించనున్నట్లు దేవదాయ శాఖ ఈవో ముక్త రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగోబా ఆలయ కమిటీ చైర్మన్‌ మెస్రం ఆనంద్‌రావ్‌, పూజరి మెస్రం శేక్‌నాథ్‌, తదితరులు పాల్గొన్నారు.

నాగోబా సన్నిధిలో భక్తజనం1
1/1

నాగోబా సన్నిధిలో భక్తజనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement