మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం
భీమిని: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పేర్కొన్నారు. ఆదివారం కన్నెపల్లి మండలంలో సుమారు రూ.1.43కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్యకేంద్రం భవనాన్ని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య భద్రత, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయ భవనాల మంజూరుకు కృషి చేయాలని పలువురు కోరారు. సాలీగాం పీపీరావు ప్రాజెక్ట్‌లో ముంపునకు గురైన బాధితులకు స్థలం కేటాయించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణం పూర్తయిందని, రామగుండం సీపీతో మాట్లాడి ప్రారంభించేలా చొరవ తీసుకోవాలని బెల్లంపల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నర్సింగరావు కోరారు. అనంతరం లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. డీఎంహెచ్‌వో అనిత, డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్‌నాయక్, వైద్యులు అనిల్‌కుమార్, దీప్తి, తహసీల్దార్ రాంచందర్‌రావు, ఏసీపీ రవికుమార్, సర్పంచులు జయలక్ష్మి, వెంకుమేర తదితరులు పాల్గొన్నారు.


