రంజాన్‌ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి | - | Sakshi
Sakshi News home page

రంజాన్‌ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

Jan 25 2026 7:27 AM | Updated on Jan 25 2026 7:27 AM

రంజాన్‌ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

రంజాన్‌ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

మంచిర్యాలఅగ్రికల్చర్‌: రంజాన్‌ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) పి.చంద్రయ్య అన్నారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వివిధ సంక్షేమ శాఖలు, మున్సిపల్‌ కమిషనర్లు, ముస్లిం మత పెద్దలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మసీదులు, ప్రార్థనా మందిరాలు, ప్రజా ప్రదేశాలలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలన్నారు. అంతర్గత రహదారుల్లో సరైన లైటింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరి, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావు, డీపీవో వెంకటేశ్వర్‌రావు, జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, ఏసీపీ ప్రకాష్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement