నా దేశం నా ఓటు! | - | Sakshi
Sakshi News home page

నా దేశం నా ఓటు!

Jan 25 2026 7:27 AM | Updated on Jan 25 2026 7:27 AM

నా దేశం నా ఓటు!

నా దేశం నా ఓటు!

● ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం ● అమూల్యమైన ఓటుకు విలువకట్టొద్దు ● నేడు జాతీయ ఓటరు దినోత్సవం ● ఈ ఏడాది థీమ్‌ ‘మై ఇండియా మై వోట్‌’

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఓటు ప్రజాస్వామ్యంలో తిరుగు లేని ఆయుధం. తమను పాలించే వారిని తామే ఎన్నుకునేందుకు వాడే గొప్ప వజ్రాయుధం. ఈ ఆయుధాన్ని సక్రమంగా వాడకపోతే ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకునే ప్రజాస్వామిక రాజ్యంలో ఓటరు నిర్ణయమే శిరోధార్యం. ఉమ్మడి జిల్లాలో 22 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఎప్పటికప్పుడు సవరణలు, నమోదు, చేర్పులతో క్రమంగా ఓటర్ల సంఖ్య పెరుగుతోంది. పది అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు లోక్‌సభ స్థానాలు, ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, మరో రెండు (ఉపాధ్యాయ, టీచర్స్‌) ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. ఇవే కాక గ్రామ వార్డు మెంబర్‌ నుంచి మొదలు, సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల ఎన్నిక ఓటర్లపైనే ఉంది. సరైన వ్యక్తులను చట్టసభలకు ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడానికి ఓటే కీలకం. గత నెలలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,505 గ్రామ పంచాయతీలు, 12,792 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరిలో ఉమ్మ డి జిల్లా పరిధిలో 11 మున్సిపాలిటీల కు, ఆ తర్వాత నాలుగు జిల్లాల పరిధి లో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానా ల కు ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సంస్థల నుంచి మొదలు దేశంలో అత్యున్నత పార్లమెంట్‌లోని లోక్‌ సభలో ప్రాతినిధ్యం వహించే వారిని నేరుగా ఓటుతోనే ఎన్నుకుంటున్నాం. అంటే మన ఊరి, పట్టణ, నగర పాలక వర్గాల నుంచి రాష్ట్ర, దేశ పాలకవర్గాల ను ఎన్నుకుంటున్నాం. చట్టాలు, శాసనాల రూపకల్పన, దేశాభివృద్ధికి ఉపయోగపడేలా ప్రజాప్రతినిధుల ఎంపికకు ఓటే కీలకంగా మారింది. అయితే ఇప్పటికీ చాలామందికి ఆ ఓటు ప్రాధాన్యత తెలియకపోగా నోటుకు, మద్యానికి, ఇతర బహుమతులకు అమ్ముకోవడంతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోంది.

అమూల్యమైన ఓటు అమ్ముకోకు..

ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో రాజ్యాంగం కల్పించిన ఓటును అమ్ముకుంటే దుర్వినియోగమవుతుంది. గె లుపేలక్ష్యంగా అభ్యర్థులు చూపే ప్రలోభాలకు లొంగితే స్వచ్ఛమైన పాలకులను ఎన్నుకునే అవకాశం కోల్పోతాం. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారే ప్రమాదం ఉంది. ఇటీవల సర్పంచ్‌ ఎన్నికల్లో ‘ఓటు అమ్ముకోం’ అంటూ కొందరు ఇంటిముందే బోర్డులు పెట్టి తమ తీరును తెలియజేశారు. మరికొంద రు ఓటర్లు తమకు డబ్బులు ఇవ్వలేదని అభ్యర్థుల ను నిలదీశారు. ఇంకొన్నిచోట్ల ఓటర్లకు డబ్బులు పంచితే ఓట్లు వేయలేదని ఇంటింటికీ తిరిగి పైసలు అడుక్కున్నారు. డబ్బులు తీసుకుని ఓట్లు వేయలేదని ఫిర్యాదులు, పంచాయితీలు జరిగాయి. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య పరిణితికి గొడ్డలిపెట్టులా మారుతున్నాయి. ఈ క్రమంలో ఓటు సక్రమంగా వాడితే దేశపురోగతికి దోహదపడుతుంది.

‘మై ఇండియా మై ఓట్‌’

దేశవ్యాప్తంగా ఓటరు దినోత్సవం నిర్వహిస్తూ .. ఓటు ఆవశ్యకతను చెబుతూ.. కొత్త వారి నమోదు, వినియోగంపై మరింత అవగాహన పెంచుతున్నారు. ఎన్నికల సంఘం ఏటా ఒక ప్రత్యేక ఇతివృత్తం (థీమ్‌)తో జరుపుతోంది. ఈ ఏడాది ‘మై ఇండియా మై వోట్‌’ (నా భార త దేశం – నా ఓటు) సిటిజన్‌ ఎట్‌ ద హార్ట్‌ ఆఫ్‌ ఇండియన్‌ డెమోక్రసీ (భారత పౌరుడు ప్రజాస్వామ్య గుండెల్లో ఉంటాడు’ అనే నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బ్రిటీష్‌ వలస పాలన అంతమై, స్వాతంత్య్రం వచ్చాక భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా అవతరించింది. సొంత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. గణతంత్ర రాజ్యంగా మారే క్రమంలో 1950 జనవరి 25న దేశ ఎలక్షన్‌ కమిషన్‌ ఏర్పాటు చేశారు. ఆ రోజుకు గుర్తుగా 2011 నుంచి దేశ వ్యాప్తంగా ఓటరు దినో త్సవం జరుపుకుంటున్నారు. మొదట 21 ఏళ్ల కు ఓటు హక్కు ఉంటే 61వ రాజ్యాంగ సవరణ చేసి, ఆ వయస్సును 18 సంవత్సరాలకు తగ్గించారు. అప్పటి నుంచి దేశంలో 18 ఏళ్ల పౌరులకు ఓటు హక్కు కల్పిస్తున్నారు.

ఉమ్మడి జిల్లా ఓటర్లు (2025 జనవరి సవరణ ప్రకారం)

నియోజక పురుషులు సీ్త్రలు ఇతర సర్వీస్‌ మొత్తం

వర్గం ఓట్లు

సిర్పూర్‌ 1,15,323 1,15,811 16 305 2,31,455

చెన్నూర్‌ 96,964 99,049 07 141 1,96,161

బెల్లంపల్లి 88,109 90,286 13 178 1,78,586

మంచిర్యాల 1,39,306 1,42,421 26 365 2,82,118

ఆసిఫాబాద్‌ 1,13,815 1,15,813 16 121 2,29,765

ఖానాపూర్‌ 1,11,157 1,16,549 14 431 2,28,151

ఆదిలాబాద్‌ 1,21,050 1,26,805 06 248 2,48,109

బోథ్‌ 1,03,554 1,10,453 02 579 2,14,588

నిర్మల్‌ 1,23,088 1,37,730 21 248 2,61,087

ముధోల్‌ 1,25,148 1,32,948 17 293 2,58,406

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement