ప్రేమించి మోసం చేసిన వ్యక్తి అరెస్టు
లక్సెట్టిపేట: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. పోలీసుస్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధిలోని గోదావరి రోడ్‌కు చెందిన వివాహితకు తన భర్తతో విడాకులయ్యాయి. కొన్నిరోజుల నుంచి ఇంటివద్దే ఉంటుంది. అదే కాలనీకి చెందిన సాయికిరణ్ ఆమెకు మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. పెళ్లికి నిరాకరించడంతో బాధితురాలి ఫిర్యాదుతో శనివారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.


