చెన్నూర్ విద్యార్థినికి ప్రతిష్టాత్మక అవార్డు
చెన్నూర్: జాతీయ స్థాయిలో నిర్వహించిన వీర్‌గాధ 5.0 సూపర్ 100లో చెన్నూర్ విద్యార్థినికి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. భారత రక్షణ, విద్యా మంత్రిత్వశాఖల ఆధ్వర్యంలో అజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో దేశ, విదేశాల నుంచి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 100 మంది విద్యార్థులు విజేతలుగా ఎంపిక కాగా, రాష్ట్రం నుంచి నలుగురు ఉన్నారు. ఇందులో చెన్నూ ర్ శార్వాణి ఇంగ్లిష్ మీడియం పాఠశాల వి ద్యార్థిని తాండ్ర స్వరమంజుప్రియ ఎంపికై న ట్లు కరస్పాండెంట్ శ్రావణ్‌కుమార్‌రెడ్డి తెలిపా రు. శనివారం విద్యార్థినికి ఢిల్లీలో రూ.10 వేల నగదు,అవార్డు అందజేశారు. ఢిల్లీలోని కర్తవ్య పద్ వద్ద జరిగే గణతంత్ర పరేడ్‌లో ప్రత్యేక అతిథిగా పాల్గొనే అవకాశం లభించింది.


