క్షుద్రపూజల కలకలం
చెన్నూర్: మున్సిపాలిటీలోని బేతాళవాడలో క్షుద్రపూజల కలకలం రేపింది. కొండ మాంత య్య, మధునయ్య ఇద్దరు అన్నదమ్ములు. శు క్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆ అన్నదమ్ముళ్ల ఇళ్ల ముందు బొగ్గుతో ముగ్గు వేసి రెండు ముక్కలు చేసిన నిమ్మకాయలు పెట్టి వెళ్లిపోయారు. శనివారం వారు తెల్ల వారుజాము నిద్రలేచి ఇంటి బయటకు వచ్చి చూస్తే ముగ్గు, నిమ్మకాయలను ఉండడాన్ని గమనించారు. ఎవరో క్షుద్రపూజలు చేసి ఉంటారని భయాందోళనకు గురయ్యారు. వెంట నే పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఘట న స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


