బెస్ట్ సింగరేణియన్‌గా సమ్మిరెడ్డి
శ్రీరాంపూర్: గణతంత్ర వేడుకలు పురస్కరించుకొని సింగరేణి ఉత్తమ కార్మికులను ఎంపిక చే సింది. శ్రీరాంపూర్ ఏ రి యా నుంచి ఆర్కే న్యూ టెక్ గనికి చెందిన ఎస్‌డీఎల్ ఆపరేటర్ కంది సమ్మిరెడ్డి బెస్ట్ సింగరేణియన్‌గా ఎంపికయ్యారు. ఎస్‌డీఎల్ ద్వారా అత్యధిక టబ్బులు నింపి, మెరుగైన హాజరుశా తం ఉండటం, యాక్సిండెంట్లకు దూరంగా ఉంటూ పనిచేసినందుకు ఆయన్ను కంపెనీస్థాయిలో ఎంపిక చేసింది. ఆయనతోపాటు ఉత్త మ అధికారిగా ఏరియా నుంచి శ్రీరాంపూర్ ఓ సీపీ మేనేజర్ ఐ.శ్రీనివాస్ ఎంపికకాగా, వీరిని కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద ఈనెల 26న జరిగే వేడుకల్లో సీంఎండీ చేతులమీదుగా సన్మానించనున్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో వివిధ గనులు, డిపార్టుమెంట్ల నుంచి మొత్తం 16 మందిని ఉత్తమ కార్మికులుగా ఎంపిక చేశారు. ఇందులో తోట వెంకటేశం(ట్రామర్, ఆర్కే 5), టి.సరోత్తంరెడ్డి(సీనియర్ మైనింగ్ సర్దార్, ఆర్కే 5), దుర్గం తిరుపతి(కోల్ కట్టర్, ఆర్కే 7), ఎం భాస్కర్‌రెడ్డి (ఫిట్టర్, ఆర్కే 7), టి.అంజయ్య(హాలర్ ఆపరేటర్, ఆర్కే న్యూటెక్), కట్కం శ్రీనివాస్ (ఫిట్టర్, ఆ ర్కే న్యూటెక్), దోర్నాల అనంతరెడ్డి(కోల్‌కట్ట ర్, ఎస్సార్పీ–1), ఇందుపల్లి జాన్సన్ (సపోర్టుమెన్, ఎస్సార్పీ–1), కోన శ్రీనివాస్(కోల్ కట్టర్, ఎస్సార్పీ–3, 3ఏ), దుంపటి మల్లయ్య(ట్రామర్, ఎస్సార్పీ–3, 3ఏ), పత్తి మల్లారెడ్డి(సీనియర్ మైనింగ్ సర్దార్, ఐకే–1ఏ), సీహెచ్ వెంకటేశ్వర్లు(ఎస్‌డీఎల్ ఆపరేటర్, ఐకే–1ఏ), ఏ.కిరణ్‌కుమార్(ఫోర్‌మెన్, ఐకే ఓసీపీ), పి.కులశేఖర్(ఎలక్ట్రీషియన్, ఐకే–ఓసీపీ), గుడెల్లి నా రాయణ(హెడ్ ఓవర్‌మెన్, ఎస్సార్పీ–ఓసీపీ), ఓల్లపు నర్సింగం(ఈపీ ఫిట్టర్, ఎస్సార్పీ–ఓసీపీ) ఉన్నారు. శ్రీరాంపూర్ ప్రగతి మైదానంలో జరిగే వేడుకల్లో జీఎం చేతుల మీదుగా సన్మానించి ప్రశంసపత్రం అందించనున్నారు.


