‘ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయాలి’ | - | Sakshi
Sakshi News home page

‘ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయాలి’

Jan 25 2026 7:27 AM | Updated on Jan 25 2026 7:27 AM

‘ఎన్నికల మేనిఫెస్టో  అమలు చేయాలి’

‘ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయాలి’

పాతమంచిర్యాల: కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫె స్టో అమలు చేయాలని కోరుతూ శనివారం సీఎం రేవంత్‌రెడ్డికి పోస్టుకార్డులు పంపించా రు. ఈ సందర్భంగా జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్‌ మాట్లాడుతూ జ్యోతిబా ఫూలే బీసీ సబ్‌ప్లాన్‌, ఉన్నత విద్యకు రుణ సదుపాయం, సివిల్‌ కన్‌స్ట్రక్షన్‌లో 42 శాతం రిజర్వేషన్‌, జిల్లా కేంద్రాల్లో బీసీ భవన నిర్మాణం, బీసీల సంక్షేమానికి లక్ష కోట్ల బడ్జెట్‌ కేటాయింపు, బీసీ ఫెడరేషన్‌ల కింద నమోదైన సొసైటీల కు రూ.10 లక్షల ఆర్థికసాయం, తదితర హమీ లు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. నాయకులు వెంకటయ్య, అంజన్న, అశోక్‌, సంతోష్‌, సత్యనారాయణ, ధర్మాజీ, మల్లేష్‌, శంకర్‌, రాజేశం, భిక్షపతి, రామన్న పాల్గొన్నారు.

వాహన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పారదర్శకంగా జరగాలి

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): షోరూంలో ఇకపై వాహన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేపడుతున్నందున డీలర్లు ఆన్‌లైన్‌ నమోదులో పారదర్శకంగా చేపట్టాలని డీటీవో వి.గోపికృష్ణ తెలిపారు. ఆయన కార్యాలయంలో శనివా రం డీలర్లతో ప్రత్యేకంగా మాట్లాడారు. డీలర్ల వద్దే వాహన రిజిస్ట్రేషన్‌ చేసేలా తీసుకువచ్చిన సాఫ్ట్‌వేర్‌లో పత్రాల నమోదు జాగ్రత్తగా చే యాలన్నారు. అన్ని పత్రాలు పరిశీలించాలన్నారు. జిల్లాలోని ద్విచక్ర, కార్ల షోరూంల డీలర్లు పాల్గొన్నారు.

ఇంటికి వెళ్లి..ఫిర్యాదు తీసుకుని..

దండేపల్లి: మండలంలోని గుడిరేవు గ్రామానికి చెందిన పంచాయతీ కార్మికుడు అరికిళ్ల రాజ న్నను శుక్రవారం రాత్రి అదే గ్రామానికి చెందిన అరికిళ్ల నర్సయ్య రోకలితో తలపై కొట్టడంతో గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు పోలీస్‌స్టేషన్‌కు రాని పరిస్థితుల్లో పోలీ సులకు కేవలం సమాచారం మాత్రమే ఇచ్చా డు. దీంతో ఎస్సై తహసీనొద్దీన్‌ శనివారం రా త్రి బాధితుడి ఇంటికెళ్లి ఫిర్యాదు తీసుకున్నారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

అనారోగ్యంతో మావోయిస్టు తల్లి మృతి

మందమర్రిరూరల్‌: ఊ రు మందమర్రికి చెందిన మావోయిస్టు రవి తల్లి బబ్బెర లక్ష్మి(80) మృతిచెందింది. అనారోగ్యంతో శుక్రవారం రాత్రి కన్నుమూసింది. మృతురాలికి ఐదుగురు కు మార్తెలు, ఇద్దరు కుమారులు. పెద్దకొడుకు వెంకటి, చిన్నకొడుకు రవి ఉన్నారు. రవి ఇంట ర్‌ చదివే సమయంలో పీపుల్స్‌వార్‌ సిద్ధాంతాల కు ఆకర్శితుడై 1995 లో మావోయిస్టు పార్టీలోకి వెళ్లాడు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని వివిధ హోదాల్లో పనిచేశాడు. అతనిపై పోలీస్‌ నిఘా పెట్టడంతో పార్టీ చత్తీస్‌ఘడ్‌కు పంపినట్లు సమాచారం. గత పదేళ్ల క్రితం తండ్రి దుర్గయ్య మృతిచెందాడు. శనివారం రాళ్లవాగులో తల్లి అంత్యక్రియలు నిర్వహించారు. పెద్ద కుమారుడు వెంకటి తలకొరివి పెట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement