హైస్కూళ్లకు సైన్స్‌ కిట్లు | - | Sakshi
Sakshi News home page

హైస్కూళ్లకు సైన్స్‌ కిట్లు

Jan 25 2026 7:27 AM | Updated on Jan 25 2026 7:27 AM

హైస్కూళ్లకు సైన్స్‌ కిట్లు

హైస్కూళ్లకు సైన్స్‌ కిట్లు

● ఉమ్మడి జిల్లాలో 70 కేజీబీవీలు, 3 మోడల్‌ పాఠశాలల ఎంపిక ● విద్యార్థుల ఇంజినీరింగ్‌ నైపుణ్యాలకు దోహదం

మంచిర్యాలఅర్బన్‌: సర్కారుబడిలో చదివే విద్యార్థులకు ప్రయోగాత్మక అభ్యాసం ద్వారా సైన్స్‌ సులభ ంగా అర్థమవుతుంది. సృజనాత్మకత, శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించేందుకు వీలు ఉంటుంది. వి ద్యాశాఖ ద్వారా పాఠశాలలకు సైన్స్‌ కిట్లు అందించాలని నిర్ణయించింది.ఈ కిట్లలో డీఐవై(డూ ఇంట్‌ యువర్సెల్ప్‌)ఎస్‌టీఈఎంప్రాజెక్టులు,రసాయన ప్ర యోగాలు ఎలక్ట్రానిక్‌, రోబోటిక్‌ అంశాలుంటాయి.

ఉమ్మడి జిల్లాలో..

కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల్లో సృజనాత్మకత, సైన్స్‌ టెక్నాలజీ నైపుణ్యం పెంపునకు మంచిర్యాల జిల్లాలో 21 అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ (ఏటీఎల్‌)లు ఏ ర్పాటు చేసింది. 6 నుంచి 12వ తరగతి విద్యార్థుల్లో ఆవిష్కరణలు, విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలు వృద్ధి చేస్తున్నారు. ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌, సృజనాత్మకత నాయకత్వ లక్షణాలు, అత్యాధునిక సాంకేతికపై అవగాహన కలుగుతుంది. ల్యాబ్‌లో త్రీడీ ప్రింటింగ్‌, రోబోటిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ఆర్టిఫిసీయల్‌ ఇంటెలిజెన్స్‌, సెన్సార్‌ అధునిక టెక్నాలజీని అందిస్తున్నారు. అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ లేని పాఠశాలల్లో విద్యార్థులను ఇంజినీరింగ్‌ నైపుణ్యాలు పెంచేందుకు తొలిదశలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 73 స్కూళ్లు ఎంపిక చేశారు. సమగ్రశిక్ష కింద అందించే సైన్స్‌ కిట్లను 70 కేజీబీవీలు, పీఎంశ్రీ కింద ఎంపికై న మోడల్‌ స్కూళ్లు మినహాయిస్తే మిగిలిన మూడు మోడల్‌స్కూళ్లలో వీటిని అందించనున్నారు. ఆది లాబాద్‌ జిల్లాలో జైనథ్‌, బోఽథ్‌, మంచిర్యాల జిల్లాలో దండేపల్లి మండలం లింగాపూర్‌ మోడల్‌ స్కూళ్లు ఉన్నాయి. పాఠశాల స్థాయిలో ఇంజనీరింగ్‌ నైపుణ్యాల పెంపునకు విద్యార్థులకు ఈ కిట్లు ఎంతో దోహదం కానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement