హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలి | - | Sakshi
Sakshi News home page

హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలి

Jan 25 2026 7:27 AM | Updated on Jan 25 2026 7:27 AM

హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలి

హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలి

● భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామిజీ

ఆదిలాబాద్‌: హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతీ హిందువు పాటుపడాలని భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతిస్వామిజీ అన్నారు. జిల్లా కేంద్రంలోని డైట్‌ కళాశాల మైదానంలో శనివారం నిర్వహించిన విరాట్‌ హిందూ సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరిలోనూ దైవం కొలువుంటుందన్నారు. దుర్గుణాలను వదిలి, సన్మార్గంలో నడిచినప్పుడు ఆధ్యాత్మికత పెంపొందుతుందన్నారు. ముందుగా నిర్వహించిన గంగాహారతి కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది. కార్యక్రమంలో శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి స్వామి, మాహోర్‌ పీఠాధిపతి చింతామణి భారతి స్వామి, కిషన్‌ మహారాజ్‌, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, మాజీ మంత్రి జోగు రామన్న, సనాతన ధర్మ హిందూ వేదిక ప్రతినిధులు జగదీష్‌ అగర్వాల్‌, రాఘవేంద్ర నాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement