● పాఠశాలకు వెళ్లాలంటే తిప్పలు ● సమయానికి రాని బస్సులు ●
జిల్లాలోని పలు మండలాల్లో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేందుకు ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. మరికొందరు ప్రైవేటు వాహనాల్లో వెళ్తుండగా.. ఇంకొందరు కాలినడకన వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఆర్టీసీ బస్సులు సమయానికి రాకపోవడం, ప్రయాణికులతో కిక్కిరిసిన బస్సులను ఆపకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. విద్యార్థుల ఇబ్బందులపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు.
నాలుగు కిలోమీటర్లు..
దండేపల్లి: మండల కేంద్రం దండేపల్లికి నాలుగు కిలోమీటర్ల దూరంలో లింగాపూర్ మోడల్ స్కూల్ ఉంది. గూడెం నుంచి వయా వెల్గనూర్, మేదరిపే ట మీదుగా లింగాపూర్ వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సు నడిపిస్తోంది. ముత్యంపేట, చింతపల్లి, నెల్కివెకంటాపూర్, తానిమడుగు, దండేపల్లి, నర్సాపూర్, గుడిరేవు, అల్లీపూర్ గ్రామాల నుంచి వచ్చే విద్యార్థుల్లో కొందరికి బస్టాప్‌లు దూరంగా ఉండడం, సమయానికి బస్సులు వస్తాయో లేదో, వచ్చినా ఆపుతారో లేదోనని ప్రత్యేకంగా ఆటోలు ఏర్పాటు చేసుకున్నారు. దూరాన్ని బట్టి ఆటోలకు నెలకు రూ.600 నుంచి రూ.వెయ్యి చెల్లిస్తున్నారు. ఆటోవాళ్లు ఉద యం దింపి సాయంత్రం తీసుకెళ్తుంటారు. గిట్టుబాటు కావాలంటే పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకోక తప్పని పరిస్థితి ఎదురవుతోంది.
చెన్నూర్‌రూరల్: మండలంలోని సోమనపల్లి గ్రామ పంచాయతీ పరిధి అనుబంధ గ్రామం లక్ష్మిపూర్ సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 8వ తరగతి నుంచి 10వ తరగతి చదవాలంటే ఆస్నాద గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలకు వెళ్లాల్సిందే. లక్ష్మిపూర్‌కు బస్సు సౌకర్యం కాని ప్రైవేటు వాహనాలు ఏవీ లేవు. ఇక్కడి నుంచి విద్యార్థినులు ప్రతీ రోజు నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ సోమనపల్లి బస్టాప్ వరకు వచ్చి.. బస్సెక్కి ఆస్నాద గ్రామంలోని బడికి వెళ్లి వస్తుంటారు. ఒత్కులపల్లి, పొన్నారం, చాకెపల్లి గ్రామాల విద్యార్థులదీ అదే పరిస్థితి.
కోటపల్లి: మండలంలోని 63వ జాతీయ రహదారిపై ఉన్న కొల్లూర్, రాంపూర్, దేవులవాడ, బబ్బరుచెల్క, లక్ష్మిపూర్ గ్రామాల్లో బస్సులు ఆగడం లేదు. చెన్నూర్ నుంచి కాళేశ్వరం వెళ్లే ఆర్డినరీ బస్సులకు ఎక్స్‌ప్రెస్ బోర్డులు తగిలించడంతో పార్‌పల్లి చింత మినహా లక్ష్మిపూర్ వరకు ఎక్కడా ఆపకపోవడంతో పాఠశాల, అవసరాల నిమిత్తం చెన్నూర్‌కు వెళ్లే వారికి ప్రైవేటు వాహనాలే దిక్కయ్యాయి. బస్సులు ఆపాలని గతంలో జాతీయ రహదారిపై గ్రామస్తులు ధర్నా నిర్వహించినా, ఆర్టీసీ డీఎంకు వినతిపత్రం అందజేసినా ఫలితం లేకుండా పోయింది. బస్సులు ఆపక విద్యార్థులు, గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి వివేక్ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని వాపోతున్నారు.
ఆగని బస్సులు..
● పాఠశాలకు వెళ్లాలంటే తిప్పలు ● సమయానికి రాని బస్సులు ●
● పాఠశాలకు వెళ్లాలంటే తిప్పలు ● సమయానికి రాని బస్సులు ●
● పాఠశాలకు వెళ్లాలంటే తిప్పలు ● సమయానికి రాని బస్సులు ●
● పాఠశాలకు వెళ్లాలంటే తిప్పలు ● సమయానికి రాని బస్సులు ●
● పాఠశాలకు వెళ్లాలంటే తిప్పలు ● సమయానికి రాని బస్సులు ●


