ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు | - | Sakshi
Sakshi News home page

ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

Jan 24 2026 7:58 AM | Updated on Jan 24 2026 7:58 AM

ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

● కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ● రోడ్డు భద్రత కమిటీ సమావేశం

మంచిర్యాలఅగ్రికల్చర్‌: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో డీసీపీ ఏ.భాస్కర్‌, బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌తో కలిసి పోలీస్‌, రవాణా, జాతీయ రహదారులు, రోడ్లు భవనాలు, ఆర్టీసీ, విద్యుత్‌, పంచాయతీ రాజ్‌ శాఖల అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లతో రోడ్డు ప్రమాదాల నివారణపై రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ పరిధిలోని రోడ్లపై చెత్త, ఆటంకాలను తొలగించాలని, ట్రాఫిక్‌ పోలీసు విభాగం రోడ్లపై అనధికార వాహన నిలుపుదల, నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. రహదారులపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు ఏర్పాట్లు చేయాలని అన్నారు. డీసీపీ భాస్కర్‌ మాట్లాడుతూ జిల్లాలో 30 హాట్‌స్పాట్‌లను గుర్తించామని, నగర పరిధిలో వాహనాల వేగ నియంత్రణ చర్యలు తీసుకోవాల్సి న అవసరం ఉందని తెలిపారు.

సమావేశంలో కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement