అట్రాసిటీ కేసుపై ఏసీపీ విచారణ
నెన్నెల: మండలంలోని కుశ్నపల్లికి చెందిన ఇద్దరిపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ శుక్రవారం విచారణ చేపట్టారు. అదే గ్రామానికి చెందిన చల్ల కమల, బాపురెడ్డి ఇంటి వద్ద జరిగిన గొడవలో వారిద్దరు కులం పేరుతో దూషించారని కుశ్నపల్లికి చెందిన రెడ్డి పద్మ 15 రోజుల క్రితం నెన్నెల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్సై ప్రసాద్.. కమల, బాపురెడ్డిలపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఏసీపీ ఫిర్యాదుదారు పద్మ, సాక్షులు స్థానికులతో మాట్లాడి గొడవకు సంబంధించిన వివరాలు సేకరించి విచారణ జరిపారు.


