ఫుట్‌బాల్ పోటీల్లో ప్రతిభ
మంచిర్యాలఅర్బన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 1న కాగజ్‌నగర్‌లో నిర్వహించిన అండర్–14 జోనల్‌స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న పల్లపు హర్షవర్ధన్, తొమ్మిదో తరగతి చదువుతున్న ప్రణీత్ ఈ నెల 3న నుంచి 5 వరకు వికారాబాద్‌లో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొననున్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థులను ప్రధానోపాధ్యాయుడు బండి రమేశ్, పీడీ రాజయ్య అభినందించారు.


