
అక్రమ కేసులు ఎత్తివేయాలి
చెన్నూర్: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి. పదే పదే కూటమి ప్రభుత్వం పోలీసులతో సాక్షి కార్యాలయాలపై దాడులు చేయించడం హేయమైన చర్య. పత్రికల గొంతు నొక్కేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం సరికాదు. గతంలో పత్రిక స్వేచ్ఛకు భంగం కలిగించిన ప్రభుత్వాలు అడ్రస్ లేకుండా పోయాయి.
– సిద్ది రమేశ్ యాదవ్, భారత యాదవ
సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్