
‘సాక్షి’పై దాడి.. పత్రికా స్వేచ్ఛపై దాడే
సాక్షి పత్రికపై ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా దాడులు చేయడం.. పత్రికా స్వేచ్ఛపై దాడిగానే పరిగణించాలని జిల్లాకు చెందిన పలువురు అభిప్రాయపడ్డారు. పత్రికలు ప్రజలకు, పాలకులకు వారధిగా ఉంటాయన్నారు. మీడియా స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు.
కక్షపూరిత చర్యలు మానుకోవాలి
పాతమంచిర్యాల: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం సాక్షిపై చే స్తున్న దాడి అప్రజాస్వామి కం. సాక్షి రాస్తున్న వార్తల్లో కుట్ర కోణం ఉందని అక్క డి ప్రభుత్వం ఎడిట ర్‌పై, ఇతర సి బ్బందిపై విచారణ పేరుతో పోలీసులతో భయబ్రాంతులకు గురిచేయడం సరికాదు. ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యంపై దాడిగానే పరిగణించాలి. ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలు రాస్తే కక్ష పూరితంగా వ్యవహరించడం సరికాదు.
– తోట రాజేశ్, పీడీఎస్‌యూ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ

‘సాక్షి’పై దాడి.. పత్రికా స్వేచ్ఛపై దాడే