
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
భీమారం: ఆర్థిక ఇబ్బందుల కారణంతో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్వేత తెలిపారు. ఆమె కథనం ప్రకారం..భీమారంలోని ఎస్సీ కాలనీకి చెందిన గాలిపల్లి తారక్ (19) మంచిర్యాలలో కొన్ని నెలలుగా కారు మెకానిక్ పని నేర్చుకున్నాడు. శిక్షణ అనంతరం భీమారంలో సొంతంగా కారు మెకానిక్ షెడ్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించున్నాడు. ఈ విషయాన్ని తండ్రి రమేశ్‌కు చెప్పగా అంత డబ్బు లేదని తర్వాత ఏర్పాటు చేద్దామనడంతో తారక్ మనస్తాపం చెందాడు. ఆదివారం సాయంత్రం ఇంట్లో మరో గదిలోకి వెళ్లి తలుపు వేసి గడియ పెట్టుకున్నాడు. అనుమానంతో తండ్రి రమేశ్ తలుపు బాదిన ఎంతకు తీయకపోవడంతో కిటీకి నుంచి చూడగా ఉరేసుకుని కనిపించాడు. తలుపులు బద్దలుకొట్టి వెళ్లి తారక్ కిందకు దించి చూడగా అప్పటికే మృతిచెందాడు. ఘటన స్థలానికి ఎస్సై శ్వేత చేరుకుని పరిశీలించారు. కుటుంబ సభ్యులను అడిగి వివరాలు సేకరించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, జిల్లా కాంగ్రెస్ నాయకుడు పొడేటి రవి.. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.