
యూనివర్సిటీ ఫుట్‌బాల్ పోటీలకు సోమగూడెం యువకుడు
కాసిపేట:మండలంలోని సోమగూడెంకు చెందిన గురునాథం శంకర్ యూనివర్సిటీస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు కోచ్ బాదె శేఖర్ తెలిపారు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళా శాలలో బీకాం మొదటి సంవత్సరం చదువుతన్న శంకర్ ఈనెల 18న హన్మకొండలో జరి గిన కాకతీయ యూనివర్సిటీ అంతర్ విశ్వవి ద్యాలయ పోటీల్లో ప్రతిభకనబర్చాడు. హైదరాబాద్‌లో జనవరిలో నిర్వహించే సౌత్‌జోన్ అంతర విశ్వవిద్యాలయ పోటీల్లో శంకర్ కాకతీ య యూనివర్సిటీ జట్టుకు ప్రాతినిధ్యం వ హించనున్నాడు. ఈసందర్భంగా కోచ్‌తోపాటు తోటి క్రీడాకారులు శంకర్‌ను అభినందించారు.
ఆవుకు అంతిమ సంస్కారం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): నంనూర్ పునరావాస కాలనీలో రైతు అత్తె శ్రీనివాస్‌కు చెందిన ఆవు ఆదివారం పాముకాటుతో మృతిచెందింది. ఈ ఆవు ఆ కాలనీలో జరిగే గృహప్రవేశాలకు వచ్చి మొదట ప్రత్యేక పూజలు అందుకునేది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో ముంపున కు గురైన నంనూర్ పాత గ్రామంలోని అభయాంజనేయ స్వామి విగ్రహాలను ఆవు సమక్షంలోనే కదిలించారు. పాముకాటుతో మృతిచెందిన ఆవుకు స్థానికులు శాస్త్రోక్తంగా పూజలు చేసి అంతిమ సంస్కాకంలో భాగంగా ఖననం చేశారు.
వ్యక్తిపై కేసు
చెన్నూర్: సోషల్‌మీడియాలో మైనింగ్ అధికారిపై అసత్య, అసభ్య ఆరోపణలు చేసిన పట్టణానికి చెందిన ముత్యాల రవికుమార్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ దేవేందర్‌రావు తెలిపారు. మైనింగ్ అధికారి రామకృష్ణ ఫిర్యాదుతో ఆదివారం కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఎవరి మనోభావాలు దెబ్బతిసేలా పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

యూనివర్సిటీ ఫుట్‌బాల్ పోటీలకు సోమగూడెం యువకుడు