
ఖండాంతరాలు దాటిన నృత్య ప్రదర్శన
కుభీర్: మండల కేంద్రానికి చెందిన కళాకారిణి ఠాకూర్ అనూష భరతనాట్య నృత్య ప్రదర్శన ఖండాంతరాలకు దాటింది. ఈమె తల్లిదండ్రులు మీరా–కరణ్‌సింగ్. తల్లి గృహిణి. తండ్రి ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. అనూషకు చిన్నప్పటి నుంచి పాటలు పాడటం(జానపద) డ్యాన్స్ చేయడం చాలా ఇష్టం. ఎంఏ ఇంగ్లిష్ విద్యనభ్యసించగా, ఆమె భరతనాట్యంలో డిప్లొమా పూర్తిచేసింది. 2008లో మా టీవీలో వచ్చిన రేలారేలా కార్యక్రమంలో పాల్గొని జానపద పాటలు పాడారు. గురువు సముద్రాల మాధవీ రామానుజం వద్ద భరతనాట్యంలో మెలకవలు నేర్చుకుంది. ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్, బెంగళూరు, భద్రాచలం, తిరుమల తదితర నగరాల్లో 400లకు పైగా, అమెరికా, యూకే, మలేషియా దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. తండ్రి ఆదిలాబాద్‌లో పనిచేయడంతో ఆమె విద్యాభ్యాసం అక్కడే సాగింది. దేశ,విదేశాల్లో భరతనాట్య ప్రదర్శన చేసిన ఆమె ఎక్కడికెళ్లిన కుభీర్ వాసిగా చెబుతోంది.