
కాకో ఆలయానికి పోటెత్తిన భక్తజనం
దండేపల్లి: తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన దండేపల్లి మండలం గుడిరేవు గోదావరినది ఒడ్డున ఉన్న ఆదివాసీల ఆరాధ్య దైవం అయిన శ్రీపద్మల్‌పురి కాకో ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వారం రోజులుగా జరుగుతున్న దండారీ ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణాలు రద్దీగా మారాయి. సమీప గోదావరి నదిలో స్నానాలు ఆచరించిన భక్తులు ఒడ్డున గల పద్మల్‌పురి కాకోను దర్శించుకుని పూజలు చేశారు. మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అక్కడే వంట చేసుకుని భోజనాలు చేశారు. ఆదివాసీల కోలాటాలు, గుస్సాడీల నృత్యాలు, భజనలు ఆకట్టుకున్నాయి.

కాకో ఆలయానికి పోటెత్తిన భక్తజనం