
జీజీహెచ్‌లో సదుపాయాలు కల్పించాలి
మంచిర్యాలటౌన్/కోటపల్లి: మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ ఆదివా రం జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే బెడ్‌పై ఇద్దరు పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారని, మరుగుదొడ్లు చాలినంతగా లేకపోవడం, ఉన్నవి సైతం అపరిశుభ్రతతో వినియోగించలేని పరిస్థితి ఉందన్నారు. సరిపడా వైద్యులు, మౌలిక వసతులు లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు రోగులను రెఫర్ చేస్తున్నారన్నారు. కోటపల్లి మండల కేంద్రంలోని వసతిగృహం శిథిలావస్థకు చేరుకోవడంతో వర్షాకాలంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్పందించిన రాంచందర్ సమస్యలను షెడ్యూలు కులాల అభివృద్ధి అధికారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మాజీ ము న్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేశ్‌గౌడ్, బీజేపీ జిల్లా కార్యదర్శి మంత్రి సురేఖ రామయ్య, ఆఫీస్ కార్యదర్శి తోట మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.
ఒకే మాను..రెండు చెట్లు
జన్నారం: ప్రకృతిలో అనేక వింతలు, విశేషాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. జన్నారం మండలం ధర్మా రం వెళ్లే దారిలో పొలాల మధ్య జువ్వి, ఇప్ప చెట్లు పెనవేసుకుని ఎ దిగాయి. ఒకే మానుకు రెండు చెట్లు ఉన్నట్లు కనిపిస్తూ ఆకర్షిస్తున్నాయి.

జీజీహెచ్‌లో సదుపాయాలు కల్పించాలి