
బడి తనిఖీకి సార్లొస్తున్నారు..
మంచిర్యాలఅర్బన్: సర్కారు పాఠశాలలను పకడ్బందీగా పర్యవేక్షించేందుకు, విద్యాప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పాఠశాలలో ఉపాధ్యాయుల బోధన నైపుణ్యాలు, విద్యార్థుల అభ్యసన తీరు పరిశీలనకు ప్రత్యేక బృందాలతో తనఖీలు చేయాలని యోచిస్తోంది. ఇందు కు పాఠశాల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులతో కమి టీల నియామకానికి కసరత్తు చేస్తోంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు వేర్వేరుగా బృందాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. జిల్లాలో వంద పాఠశాలలకు ఒక కమిటీ చొప్పున ఎనిమిది బృందాలను నియమించనుంది. విద్యాశా ఖ నిర్వహించిన వివిధ శిక్షణ కార్యక్రమాలు, పదేళ్ల అనుభవం, సబ్జెక్టుల్లో పాఠ్యాంశ ప్రదర్శన ఇచ్చే టీచర్లకు కమిటీలో అవకాశం కల్పించనుంది. ప్రాథమిక పాఠశాలల్లో పీఎస్ హెచ్‌ఎంతో పాటు ఇద్దరు ఎస్జీటీలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్కూల్ అ సిస్టెంట్ నోడల్ ఆఫీసర్‌గా ఇద్దరు ఎస్జీటీలు, ఉన్నత పాఠశాలల్లో జీహెచ్‌ఎం ఏడుగురు సబ్జెక్టుల టీచ ర్లు, పీడీతో కూడిన బృందాలు తనఖీలు నిర్వహిస్తా యి. కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీలో స్థాని క సంస్థల అదనపు కలెక్టర్, డీఈవో, కలెక్టర్ నామి నెట్ చేసిన ఒక అధికారి ఉంటారు. ఈ బృందాల్లో ఉన్న ఉపాధ్యాయులు పూర్తికాల సభ్యులుగా కొనసాగనున్నారు. ఈ విద్యాసంవత్సరం వరకు ఉండనున్నారు. ఎంపికైన ఉపాధ్యాయుల స్థానంలో డీఈవోలు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు.
మూడు నెలల్లో తనిఖీలు పూర్తి
జిల్లాలో 486 ప్రాథమిక పాఠశాలలకు ఐదు, 96 యూపీఎస్‌లకు ఒకటి, 108 ఉన్నత పాఠశాలలకు రెండు తనిఖీ బృందాలను నియమించనున్నారు. పాఠశాలల తనిఖీలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక టీంలు మూడునెలల్లో తమ పరిధిలోని అన్ని పాఠశాలల్లో తనిఖీలు పూర్తి చేయాలి. ప్రతినెలా 5న అందుబాటులో ఉన్న వివరాలు డీఈవోకు నివేదించాలి. బడికి వెళ్లి తరగతి గదిలో బోధన తీరు గమనించా లి. విద్యార్థుల నుంచి వివరాలు తెలుసుకోవాలి. పా ఠాలు కూడా బోధించాల్సి ఉంటుంది. స్టాఫ్ మీటింగ్ నిర్వహించి ఎప్పటికప్పుడు సమావేశ వివరాలు అప్‌లోడ్ చేయాలి. విద్యార్థుల ప్రగతిని అంచనా వే యడం, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్‌ల పరిశీలించడం చే స్తూ ఉండాలి. విద్యార్థులు, టీచర్లు హాజరు, పనితీ రు వివరాలు ప్రత్యేక బృందాలు అడిగి తెలుసుకో నున్నాయి. మధ్యాహ్న భోజన పథకం అమలు, పా రిశుధ్య నివారణ చర్యలు, తాగునీటి సదుపాయం, ఇతర సౌకర్యాల గురించి క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నాయి.