
ఆనందాల కేళి
ముగ్గువేసి దీపాలు వెలిగిస్తున్న
సెక్టోరల్ అధికారి విజయలక్ష్మి
మంచిర్యాలఅర్బన్: జిల్లా కేంద్రంలో దీపావళి వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకొన్నారు. ఉదయం నుంచే దుకాణాలు, ఇళ్లను పూలతో
అందంగా అలంకరించారు. ఇళ్ల ముందు రంగురంగుల విద్యుద్దీపాలు, ప్రమిదలు వెలిగించారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాణాసంచా, మిఠాయి దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయాయి. పిల్లలు, పెద్దలు బాణాసంచా కాల్చి సంబురాల్లో మునిగితేలారు. టపాసుల మోత, తారాజువ్వల వెలుగులతో వాడలన్నీ మెరిసిపోయాయి.

ఆనందాల కేళి