
వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి
మంచిర్యాలటౌన్: జిల్లాలోని ప్రభుత్వ వైద్యులు, వైద్య సిబ్బంది సమయపాలన పాటించా లని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత సూచించారు. జిల్లా కేంద్రంలోని హ మాలీవాడ బస్తీ దవాఖానాను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న వై ద్య సేవలను పరిశీలించారు. బుధ, శనివారా ల్లో వ్యాక్సినేషన్‌ను తప్పనిసరిగా నిర్వహించా లని సూచించారు. ప్రతీ శుక్రవారం డ్రైడేను పాటించడంతో పాటు జిల్లాలోని ప్రజలకు కీటకజనిత వ్యాధులు రాకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. గ ర్భిణుల వివరాలను నమోదు చేసి, వారికి నె లనెలా వైద్యులు పరీక్షలు నిర్వహించి, సాధారణ ప్రసవం అయ్యేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో డాక్టర్ రమ్య, డీపీహెచ్‌ఎన్ పద్మ తదితరులు పాల్గొన్నారు.