
అమరుల త్యాగాలు మరువలేనివి
మంచిర్యాలక్రైం: విధి నిర్వహణలో అమరులైన పో లీసుల త్యాగాలు స్ఫూర్తిదాయకమని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. మంగళవా రం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అమరవీరుల స్తూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. మంచిర్యాల కలెక్టర్ కుమార్‌దీపక్, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఆర్జీ–1 డివిజన్ జీఎం లలి తకుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. ప్రజాసే వ కోసం తమ ప్రాణాలర్పించిన పోలీసులు మహా నుభావులని, వారు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడాలని సూచించా రు. పోలీస్ అమరవీరుల కుటుంబాలకు పోలీసుల సహాయసహకారాలు ఉంటాయని, ఎలాంటిసమ స్యలు ఎదురైనా తమ దృష్టికి తేవాలని సూచించా రు. అంతకుముందు డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ దేశంలో 191మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా వారి పేర్లు చదివి వినిపించారు. కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ రమేశ్, మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏవో శ్రీనివాస్, కమిషనరేట్ పరిధిలోని ఇన్‌స్పెక్టర్లు, వివిధ విభాగాల ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐ, ఏఆర్‌ఐలు, ఈపీవోలు, స్పెషల్ పార్టీ, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.
గుడిపేట బెటాలియన్‌లో..
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్‌లో స్మృతి పరేడ్ నిర్వహించారు. అనంతరం అమరవీ రుల స్తూపం ఎదుట పోలీస్ అమరవీరులకు బెటా లియన్ కమాండెంట్ వెంకటరాములు, పోలీస్ అధి కారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు. బె టాలియన్ సిబ్బంది, మినిస్టీరియల్ సిబ్బంది, శిక్షణ కానిస్టేబుళ్లు రెండు నిమిషాలు మౌనం పాటించా రు. గౌరవ వందనం చేస్తూ శ్రద్ధాంజలి ఘటించా రు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్‌లు నాగేశ్వర్‌రావు, బాలయ్య, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్సైలు, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.
మంచిర్యాలక్రైం: అమరవీరులకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పిస్తున్న కలెక్టర్ కుమార్‌దీపక్
మంచిర్యాలక్రైం: స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పిస్తున్న సీపీ అంబర్ కిషోర్ ఝా

అమరుల త్యాగాలు మరువలేనివి

అమరుల త్యాగాలు మరువలేనివి